రాష్ట్ర అసోసియేషన్‌లో జిల్లా వాసులకు స్థానం
సుభాష్‌నగర్, (జనంసాక్షి): రాష్ట్ర ఆర్‌ఎం పీఎంపీ ఆసోసియేషన్‌లో జిల్లా సభ్యులు అత్యధిక పదవులు దక్కించుకోవడం అభినందని కరీంనగర్ జిల్లా ప్రవేటు మెడికల్ ప్రాక్టీసనర్స్ అసోసియేషన్స్ అసోసియేషన్స్ ఆధ్యక్షుడు బీరత్నం పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రెస్ భవన్‌లో అసోసియేషన్ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అసోసియేషన్‌లో జిల్లా ఆర్‌ఎంపీ, పీఎంపీ సభ్యుల వివరాలను రత్నంతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.భాస్కర్ వెల్లడించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తిరుపతిడ్డి (కరీంనగర్), ప్రభాకర్‌రెడ్డి (వీణవంక), శంకర్ (పెగడపల్లి), అయూబోద్దీన్ (మహదేవపూర్), రవీందర్‌రెడ్డి (తిమ్మాపూర్), రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా సుధాకర్, రమేశ్, నర్సింహరాజు , మల్లేశం , వెంక రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగాడీ. మనోహర్, రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా శ్రీనివాసమూర్తిగా , అధికార ప్రతినిధిగా రవీందర్, ఈసీ మెంబర్లుగా రవీందర్, అబ్దుల్లా, లక్ష్మణ్, స్వామి, రవీందర్, మనోహర్ ఎన్నికయ్యారు. సమావేశంలో జిల్లా కోశాధికారి లక్ష్మినారాయణ, జాయింట్ సెక్రటరీ తిరుపతిరెడ్డి, పట్టణ అధ్యక్షులు డి.మనోహర్, గౌరవధ్యక్షులు సత్యనారాయణ, గౌరవ సలహాదారులు వీరవూబహ్మం, నిజామొద్ధీన్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం
కార్పొరేషన్, (జనంసాక్షి): జిల్లాలో డిస్ట్రిక్ట్ ఈ గవర్నన్స్ సొసైటీకి సహకరించేందుకు జిల్లా మేనేజర్ నియమాకానికి దరఖాస్తులు చేసుకోవాలని జేసీ అరుణ్‌కుమార్ తెలిపారు. బీసీఏ, బీఐటీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, డిప్లమా విద్యార్హతలతో సంవత్సరాలు టెక్నికల్ అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకొవాలని సూచించారు. అసక్తి గల వారు ఈనెల 25లో గా దరఖాస్తు చేసుకొవాలని కోరారు.