రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న కెసిఆర్..
మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 4
తెలంగాణ మాటల మాంత్రికుడు, మాయ, జూట మాటలతో తెలంగాణను నాశనం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు. బిజెపి పార్టీ చేపట్టిన ప్రజాగోష భరోసా యాత్ర అదివారం ఆ పార్టీ మండల అధ్యక్షుడు చల్ల ఐలయ్య ఆధ్వర్యంలో శంకరపట్నం మండలంలో యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గ్రామాల్లో గాలి నిర్వహించి,మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ శంకరపట్నం మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో దిలీప్ కుమార్ మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు కూడ మాంత్రికుని లెక్కనే ఉన్నాయని, కెసిఆర్ చెప్పేది ఒకటి చేసేది ఒకటని, లెక్కలేనన్ని హామీలిచ్చి మాయ, జూట మాటలతో తెలంగాణ జనాన్ని , రాష్ట్రాన్ని నాశనం కపిలవాయి దిలీప్ కుమార్ విమర్శించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో రాష్ట్రంలో 1200 మంది ఉద్యమకారులు, తమ ప్రాణాలను బలిదానం చేసిన కుటుంబాలను, ఉద్యమకారులను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి తెలంగాణ వ్యతిరేకులను ప్రభుత్వం లోకి తీసుకొని, తెలంగాణ ప్రజానీకానికి తీరని అన్యాయం చేస్తూ తన కుటుంబంలోనే ఉద్యోగాలను సాధించుకున్నాడని , తెలంగాణ ప్రజలకు కోట్లాది రూపాయలను అప్పులను తయారు చేసి పెట్టాడని ఆరోపించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మానకొండూర్ నియోజకవర్గానికి, నియోజకవర్గంలో భాగమైన శంకరపట్నం మండలానికి చేసిన మంచి పని ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి శంకరపట్నం మండలం అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడ నెరవేర్చకపోవడం సిగ్గుచేటన్నారు.మండలంలోని కాచాపూర్ లోని పి హెచ్ సి సెంటర్ నుకూలగొట్టి, రైతు వేదిక నిర్మించడం,గద్దపాకలో మహిళా సంఘ భవనం కూల్చడం,దౌర్జనంగా ఆ స్థలాలను ఇతర కార్యక్రమాలకు వాడుకోవడం అభివృద్ధి అంటారా అని ఆయన ప్రశ్నించారు.కేశవపట్నం అంబేద్కర్ విగ్రహం నుండి పాపయ్యపల్లి వరకు ఎమ్మెల్యే రసమయి నిర్మిస్తామన్న రహదారి హామీ ఎందుకు నిలబెట్టుకోలేదన్నారు . మండలంలో1డబల్ బెడ్ రూమ్ ఇల్లుల నిర్మాణానికి చెయ్యలేదని, మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని,ఎమ్మెల్యే రసమయి హామీ ఇచ్చి ఏండ్లు గడిచిన వాటిని నెరవేర్చకపోవడం ఎమ్మెల్యే, ప్రభుత్వ పనితనాన్ని నిదర్శనం అన్నారు. శంకరపట్నం మండలాన్ని సీడ్ హబ్ గా దిద్దాల్సిన అవసరం ఎంతైన అన్నారు. బిజెపి పార్టీ నాయకులు తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ పటిష్టతకు సైనికుల పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మనకు నియోజకవర్గ నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్, వాసుదేవ రెడ్డి, ఎల్లన్న, జయ చందర్,అజయ్ వర్మ, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, మాడ వెంకట్ రెడ్డి, మల్లేశం, జిల్లా కార్యదర్శి భాస్కరాచారి, జిల్లా అధికార ప్రతినిధి సమ్మిరెడ్డి, ప్రవీణ్, మీడియా కన్వీనర్ లోకేష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి,శంకరపట్నం కేశపట్నం ఎంపీటీసీ 2 సభ్యులు అనిల్, లింగాపూర్ ఎంపీటీసీ లతా రాజిరెడ్డి, అశోక్, సంపత్, కుమార్, నరేష్, జగ్గారెడ్డి, సాగర్ , శ్రీనివాస్ వివిధ గ్రామాల బూత్ కమిటీ అధ్యక్షులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు