రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌తో దోస్తీ
మారిన పరిస్థితుల్లో రూటు మార్చిన బాబు
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బాబుకు అగ్నిపరీక్ష
కాంగ్రెస్ గెలిస్తేనే బాబు యత్నాలకు ఊపు
అమరావతి,నవంబర్12(జనంసాక్షి): రానున్న ఎన్నికలలో ప్రధాని మోదీని నిలువరించక పోతే రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చినా మరింతగా ఇబ్బంది పెడతారని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ కారణంగా తనను రాజకీయంగా దెబ్బకొట్టాలనుకున్న నరేంద్ర మోదీని కూడా అదే రీతిలో దెబ్బతీయడానికి ప్రయత్నించడం మినహా తన ముందు మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన ముందుకొచ్చారు. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అంటే ఎడమొహం పెడమొహంగా ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీలతో చర్చించి ఒకేతాటిపైకి తసీఉకుని వచ్చే ప్రయత్నంలో కొంత సఫలం అయ్యారు. లోక్‌సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్‌తో కలిసి పోటీ చేయడానికి మాయావతిని ఒప్పించగలిగారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో పాటు కాంగ్రెస్ తదితర నేతలతో ఇప్పటికే మంతనాలు చేపట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో నరేంద్ర మోదీని అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగితే జాతీయ రాజకీయాలలో చంద్రబాబు మళ్లీ చక్రం తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల కంటే ముందే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలలో అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేక ఫలితాలను రాబడితే చంద్రబాబు ప్రయత్నం మరింత ఊపందుకుంటుంది. ఈ ఐదు రాష్ట్రాలలో మెజారిటీ రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగలిగితే జాతీయ రాజకీయాలలో చంద్రబాబు హవా మరింత పెరుగుతుంది. ప్రస్తుతానికి రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు మెరుగుపడ్డాయి. ఛత్తీస్‌గఢ్, తెలంగాణలలో కూడా విజయం సాధించ గలిగితే వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్‌పై నమ్మకం పెరుగుతుంది. అందుకే ఎన్నికల కంటే ముందుగానే ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ సంఘటితం చేయడానికి ప్రయత్నించడం ద్వారా చంద్రబాబు జాతీయరాజకీయాల్లో మరోమారు తన పాత్రను నిలుపుకున్నారు. ఈ దశలో కేంద్రంలో మళ్లీ మోడీ నాయకత్వం వస్తుందన్న భావనలో కెసిఆర్ ఉండివుంటారు. అందుకే కెసిఆర్ పెద్దగా స్పందించడం లేదు. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమిపాలైతే నరేంద్ర మోదీ ప్రభ మరింత మసకబారుతుంది. అది రాజకీయంగా చంద్రబాబుకు కలిసివస్తుంది. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డిని చేరదీసి తనను ప్రత్యర్థిగా చూడటం మొదలెట్టాకనే బాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. మరోవైపు విభజన హావిూలు గాలికి వదిలేశారు. రాష్ట్రంలో తాను రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించవలసిన అవసరం ఉందన్నది చంద్రబాబు అభిప్రాయంగా ఉంది.
గతంలో తెలంగాణ ప్రజలలో ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆకాంక్ష ఎంత బలంగా ఉండిందో, ఇప్పుడు ఏపీ ప్రజల్లో ప్రత్యేక ¬దా కావాలన్న కోరిక కూడా అంతే బలంగా ఉందని చంద్రబాబు నమ్ముతున్నారు. ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసినందున ఇప్పుడు ఆ పార్టీతో జత కలిసినా ప్రజలు అపార్థం చేసుకోరని పార్టీ నాయకులకు చంద్రబాబు వివరిస్తున్నారు. దీంతో మోడీతో కలసి ఉన్నా లభం లేదన్న రీతిలో బాబు ముందుగానే జాగ్రత్త పడ్డారని తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్మోహన్రెడ్డికి లబ్ధి చేకూర్చే విధంగా బీజేపీ నాయకులు తనపై ముప్పేట దాడి చేస్తున్నారనీ వారు అభిప్రాయపడుతున్నారు. నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా జట్టు కట్టే విషయమై ప్రస్తుతానికి తటస్థంగా ఉన్న ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వంటి వారు కూడా మనస్సు మార్చుకునే అవకాశం ఉందనీ, లోక్‌సభ ఎన్నికల నాటికి జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేక కూటమి త మరింత బలపడుతుందన్నది బాబు అంచనాగా చెబుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలవడం, కాంగ్రెస్‌తో జట్టు కట్టడం ఒక రకంగా కొత్త రాజకీయ సవిూకణంగా చూడాలి. కాంగ్రెస్ లేకుండా ప్రధాని నరేంద్ర మోదీని నిలువరించడం కష్టమనీ, గతంలో కూడా యునైటెడ్ ఫ్రంట్ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పుడు కాంగ్రెస్ మద్దతు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు. కాంగ్రెస్ లేకుండా కేవలం ప్రాంతీయ పార్టీల కూటమితో బీజేపీకి వ్యతిరేకంగా అవసరమైన మెజారిటీ సమకూర్చుకోవడం అసాధ్యమన్నది చంద్రబాబు అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే కొన్ని విమర్శలు ఎదురవుతున్నా కాంగ్రెస్‌తో కలిసి రాజకీయం చేయవలసి వస్తున్నదని ఆయన వివరణ ఇచ్చుకుంటున్నారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించు కోవచ్చుననీ, ప్రత్యేక ¬దా సాధించు కోవచ్చుననీ చంద్రబాబు నమ్ముతున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేయాలనుకున్న చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలపై పడి అనుకూల ఫలితాలు సాధించగలిగితే రాజకీయంగా చంద్రబాబు మరింత బలపడతారు. డిసెంబరు 11వ తేదీన వెలువడనున్న సెవ్గిూ/నైల్స్ ఫలితాలను బట్టి చంద్రబాబు ప్రయత్నాలకు పరీక్ష కాబోతున్నాయి.