రాష్ట్ర విఆర్ఏల జేఏసీ చైర్మన్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు

కేసముద్రం ఆగస్టు 23 జనం సాక్షి  / మండల కేంద్రంలో మంగళవారం మహబూబాబాద్ జిల్లా వీఆర్ఏల జేఏసీ అధ్యక్షుడు బెజ్జం భరత్ కుమార్ పత్రిక ప్రకటన విడుదల చేసి అనంతరం మాట్లాడుతూ..మంగళవారం రాష్ట్ర విఆర్ఏ జేఏసీ అధ్యక్షులు మినుగు రాజయ్య కు పెరాలసిస్ వచ్చి ( బైయిన్ లో నరాలు దెబ్బతిన్నాయని)ఉస్మానియా హస్పిటల్ డాక్టర్లు తేలీయజేశారని ,వీఆర్ఏ జేఏసీ  30 రోజుల నిరవధిక సమ్మెలను ముందుండి నడిపించి,అన్ని సంఘాలను జేఏసీ గా ఏర్పాటుచేయటంలో ప్రధమ పాత్ర పోషించి, నిన్న జరిగిన పెద్దపల్లి విఆర్ఏల పే స్కెల్ జాతర లో పాల్గొన్న రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు రాజయ్య ఇన్ని రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏ లకు ఇచ్చిన ఎలాంటి హామీలు ఆమలు కాలేదని మనస్తాపంకు గురైనారని ,గతంలో రాజయ్యకి పెరాలసిస్ ఉన్నందున మరల మనోవేదనకు గురైన కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని భరత్ కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఆయన ఉస్మానియా ఆసుపత్రి లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని, ఒక వేళ రాష్ట్ర జేఏసీ చైర్మన్ కు ఏమైనా జరిగితే దానికి, జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.రాష్ట్ర విఆర్ఏ చైర్మన్ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల విఆర్ఏలు ఆయా దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోలుకోవాలని వేడుకుంటున్నాం అని తెలియజేశారు.