రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 బిసి స్టడీ సర్కిల్స్లో గ్రూప్ 2 ,3 ,4 శిక్షణ తరగతుల్లో చేరాలని పిలుపు
ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో బిసీ స్టడీ సర్కిల్ విద్యార్థుల ఘనత
అభినందించిన బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఐఎఎస్ గారు
తెలంగాణ బిసీ స్టడీ సర్కిల్ లో శిక్షణ పొందిన నిరుద్యోగ పేద యువత పోలీస్ రిక్యూట్ మెంట్ పరీక్షలో అధికసంఖ్యలో అర్హత సాధించడం పై బిసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఐఎఎస్ గారు ఆనందం వ్యక్తం చేశారు.అత్యుత్తమ ఫలితాలు సాధించేలా యువతకు గ్రూప్ 2,3,4 పరీక్షలకు ఉచితంగా శిక్షణను ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్న బిసి స్టడీ సర్కిల్ లో యువత పెద్ద సంఖ్యలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రప్రభు త్వం అందిస్తున్న అవకాశాలను అందుకోవాలని, సరైన ప్రణాళికతో చదివి ఉద్యోగం సాధించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఇటీవల నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ నియామక పరీక్షలో బిసీ స్టడీ సర్కిల్ లో శిక్షణ పొందిన వారిలో 1048 మంది ఎంపికయ్యారని వెంకటేశం సార్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 స్టడీ సర్కిల్ ల్లో పోలీస్ ఉద్యోగాల కోసం 2980మందికి శిక్షణ ఇవ్వగా వారిలో 1048 మంది రాత పరీక్షలో అర్హత సాధించి ఫిజికల్ రౌండ్ కు ఎంపిక అయ్యారని ఆయన పేర్కోన్నారు. అధిక సంఖ్యలో యువత ఉత్తీర్ణత సాధించేలా కోచింగ్ అందించిన బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ ను, అధ్యాపకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా బిసీ స్టడీ సర్కిల్ లో ఆన్ లైన్ ఫౌండేషన్ కోర్సు, ఫిజికల్ కోచింగ్ ను గత కొద్ది నెలలుగా నిర్వహిస్తున్నామని, నిరుద్యోగ యువతకు చేయూతనిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా శిక్షణ ఇస్తున్నామని బుర్రా వెంకటేశం గారు పేర్కొన్నారు. బిసీ యువతకు సివిల్స్, గ్రూప్ 1 శిక్షణను అందిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్ 2,3,4 పరీక్షలకు అవసరమైన శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం బిసీ యువత భవితకు ఉపయోగపడేలా బిసీ స్టడీ సర్కిల్లో అత్యుత్తమ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, రీడింగ్ రూమ్, డిజిటల్ క్లాస్ రూమ్ లను ఏర్పాటు చేసిందని వెంకటేశం సార్ వివరించారు. పోటీ పరీక్షల నిపుణులైన అధ్యాపకుల చేత యువతకు కోచింగ్ ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బిసి స్టడీ సర్కిల్ లో చేరి తమ భవితకు బంగారు బాట వేసుకోవాలని ఆయన సూచించారు.
ReplyForward
|