రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న తెలుగు టీచర్ సయ్యద్ షఫీ
ఖమ్మం, సెప్టెంబర్ 5: గురు పూ జోత్స్తవ కార్యక్రమం లో ఖమ్మం నగరం లోని GHS. రిక్కా బజార్ లో తెలుగు ఉపాధ్యాయుడు గా పనిచేస్తున్న సయ్యద్ షఫీ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి , హోం శాఖ మంత్రి మహమూద్ అలీ , టూరిజం అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ , ఫోటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా అందుకోవటం సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతి లో అందుకున్నారు. ఈ సందర్బముగా సయ్యద్ షఫీ మాట్లాడుతూ ఈ అవార్డు రావడంతో ఎంతో సంతోషంగా ఉందని, ఈ అవార్డు రావడానికి ముఖ్యంగా తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉందన్నారు. రాబోయే రోజుల్లో మరింత విద్య అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.ఈ అవార్డు నా విద్యార్థుల మరియు తల్లిదండ్రుల మిత్రుల తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సహకారంతో నేను చేసిన కృషికి లభించిన ప్రభుత్వ గుర్తింపని, ఎంతో ఆనందముగా ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనపర్తి వెంకటేశ్వర్లు,PRTU జిల్లా అధ్యక్షులు మోత్కూరు మధు, ప్రథాన కార్యదర్శి, రంగారావు, యలమద్ధి వెంకటేశ్వర్లు, కన్నయ్య ,, శ్రీనివాస చారి, ఆశ, కిషోర్, మోహన్ రావు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు