రాహుల్,బాబుల కలయికతో బ్రహ్మాండాలు జరగవు
ప్రజలు విశ్వసనీయతకు పెద్దపీట వేస్తారు
వారి కూటమితో ఒరిగేదేవిూ లేదు
టిఆర్‌ఎస్ అభివృద్ది రాజకీయాలను నమ్ముతుంది
ఢిల్లీలో అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి
హైదరాబాద్,నవంబర్2(జనంసాక్షి): చంద్రబాబును, కాంగ్రెస్‌ను నమ్మే రోజులు పోయాయని, వారు కలసినంత మాత్రాన ఏదో జరిగిపోతుందన్న భ్రమలో ఆ రెండు పార్టీల నేతలు ఉన్నారని ఢిల్లీలో అధికార ప్రతినిధి, మాజీ కేంద్రమంత్రి, టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి అన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమని అన్నారు. రాహుల్, చంద్రబాబులు ఇద్దరూ దానిని కోల్పోయారని అన్నారు. వృధ్దతరం నేతలంతా కలిస్తే ఏదో జరుగుతందన్నది భ్రమే కాగలదని తాజారాజకీయా పరిణామాలపై వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత రాజకీయాలకు కొత్తభాష్యం చెప్పి, అభివృద్దిని అజెండగా మలచిన వ్యక్తి సిఎం కెసిఆర్ అని అన్నారు.నాలుగేళ్ల పాలనలో అద్భుతాలు చేశామని చెప్పకున్నా మార్పునకు నాంది పలికామని, గణనీయమైన ప్రగతి సాధించామని అన్నారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతున్నదని అన్నారు. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా నాలుగున్నరేండ్లుగా కేసీఆర్ విరామమెరుగక పనిచేస్తున్నారని చెప్పారు. ప్రజల్ని దోచుకొనేందుకు మాయాకూటమిగా వస్తున్న కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు నమ్మరని అన్నారు.వారిది కేవలం స్వార్థ ప్రయత్నం తప్ప అందులో చిత్తశుద్ది లేదన్నారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ పూర్తిగా అన్యాయానికి గురయ్యిందన్నది ప్రపంచానికి తెలియని విసయం కాదన్నారు. కరంటు లేక పంటలు ఎండి రైతన్నలు ఆత్మహత్యలు చేసుకొన్నా ఆనాడు పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు రాకుండా సీఎం కేసీఆర్ పకడ్బందీ చర్యలు తీసుకొన్నారు. అలాగే బడుగు, బలహీన వర్గాలు, వృద్ధులు, ఒంటరి మహిళలకు అండగా నిలిచారు. మత్స్యకారుల ఉపాధిని దృష్టిలో పెట్టుకొని మిషన్ కాకతీయ పథకం కింద పూడికలు తీయించి చెరువుల్లో నీరు నిండేలా చేశారు. సంకీర్ణం కావాలా సంక్షేమం కావాలా? అన్నది ప్రత్యేకించి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సి సమయం ఇదన్నారు. కూటమి అధికారంలోకి వస్తే కరంటు సంక్షోభం వస్తుందని అన్నారు. 24గంటలపాటు కరెంట్ ఇవ్వడమే ఓ విప్తవమన్నారు. ఇంతకన్నా సంస్కరణ ఏదైనా ఉంటుందా అని వేణుగోపాలాచారి అన్నారు. వారు పొరపాటునఅధికారంలోకి వస్తే రాజకీయ, ఆర్థిక సంక్షోభం వస్తుంది అని అన్నారు. తెలంగాణను ఈ నాలుగున్నరేండ్లలో సంక్షేమ, సుభిక్ష రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. కల్యాణలక్ష్మి, రైతుబంధు పథకాలను తీసుకురావడమే కాకుండా 24గంటల కరంటు ఇచ్చిన గొప్పతనం సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు. సుభిక్ష రాష్ట్రంలో కొనసాగుతున్న పథకాలన్నీ ఉండాలంటే మనం కేసీఆర్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. /ూష్ట్రంలో అమలవుతున్న పథకాలను అందరూ మెచ్చుకుంటున్న విషయాన్ని గుర్తించాలన్నారు. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్,టిడిపి కూటమిని ప్రజలు విశ్వసించరని అన్నారు.