రాహుల్ త్రిపాఠి అర్ధశతకం
జయపుర: రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి అర్ధశతకం సాధించాడు. 12వ ఓవర్లో గ్రాండ్‌హోమ్ వేసిన ఐదో బంతికి రెండు పరుగులు చేసి 50 పరుగులు పూర్తి చేశాడు. ఈ సీజన్లో త్రిపాఠికి ఇది మొదటి అర్ధశతకం కాగా ఐపీఎల్ చరిత్రలో మూడోది మాత్రమే.
13 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్ వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో త్రిపాఠి 64, రహానె 33 పరుగులతో ఉన్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు అజేయంగా 99 పరుగులు జోడించారు.