రాహుల్ గాంధీ జోడోయాత్రకు మండల కాంగ్రెస్ నాయకుల ప్రయాణం

 

రుద్రూర్(జనంసాక్షి) :- రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి భారత్ దేశ జోడో యాత్ర చారిత్మక ఘట్టామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ అన్నారు. రాహుల్ గాంధీ చేపడుతున్న జోడో యాత్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం రుద్రూర్ మండల కాంగ్రెస్ నాయకులు రుద్రూర్ నుండి మెనూర్ వరకు జోడోయాత్రలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు పార్వతి ప్రవీణ్, తోట్ల అరుణ్ కుమార్, కాసుల మహేష్, మశెట్టి శ్రీనివాస్ , జల్లాపురం సాయి, తొట్ల కిరణ్, నరేష్ , కరికే అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.