రికవరీ నిలిపివేయాలని ధర్నా
కాసిపేట: సింగరేణి అధికారులు, గుర్తింపు సంఘం టీబీజీకేస్ కుమ్మక్కై మందమర్రి ఏరియాలోని వివిధ గనులు; డిపార్టుమెంట్ల కార్మికుల వేతనాల నుంచి రూ. వంద రికవరీ చేయడం నిలిపి వేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక గని మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల అంగీకారం లేకుండా వేతనాల్లో నుంచి మందమర్రి వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఖర్చు కోసం రికవరీకి ఆదేశాలు ఇవ్వడం దారుణమని అన్నారు. గుర్తింపు సంఘం కార్మికుల సమస్యలు మరిచి అధికారులకు వంతపాడడంతో ఇబ్భందులు ఎదుర్కోంటున్నారని తెలిపారు. అధికారులు వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం గని మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కాసిపేట గని ఫిిట్ కార్యదర్శి దాగం మల్లేష్, నాయకులు బియ్యాల వెంకటస్వామి, ఎం.కోటయ్య, శ్రీనివాస్, కామెర రాములు, కార్మికులు పాల్గోన్నారు.



