రిక్వెస్ట్ బస్ స్టాప్ బోర్డును ఏర్పాటుచేసిన సర్పంచ్

ఖానాపురం అక్టోబర్11జనం సాక్షి
మండలంలోని నూతన గ్రామపంచాయతీ నాజీతండ గ్రామపంచాయతీ కి వెళ్లే దారిజాతీయ రహదారి 365 పై మంగళవారం గ్రామ సర్పంచ్ బాదావత్ బాలకిషన్ ఆధ్వర్యంలో నాజీతండ గ్రామ పంచాయతీకి దారి, రిక్వెస్ట్ బస్ స్టాప్ బోర్డును జాతీయ రహదారి 365 పై ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్
బాదావత్ బాలకిషన్ మాట్లాడుతూ ఈ బోర్డ్ ద్వారా నాజీతండా గ్రామ పంచాయతీకి వచ్చే వారికి సులువుగా ఉంటుందని, గ్రామ విద్యార్థులు మరియు ప్రయాణికులకు రిక్వెస్ట్ బస్టాప్ గా ఉపయోగపడుతుందని,ఈ మార్గం ద్వారా గుంజెడు ముసలమ్మ దేవాలయానికి వెళ్లే వారికి బైపాస్ మార్గంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మండల యూత్ అధ్యక్షులు బానోతు శ్రీనివాస్ నాయక్ , వార్డ్ సభ్యులు తేజావత్ నరేష్, భాస్కర్ , తెరాస గ్రామ పార్టీ అధ్యక్షులు బానోత్ కిరూ నాయక్ , గ్రామ పెద్దలు సూర్య నాయక్,బికపతి,రవి,రమేష్, హాటియ,బాలకిషన్,శ్రీను, యాకు మరియు గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.