రిజి స్ట్రేషన్ల జాతర
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్: భూముల విలువ పెంపుతో రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. రేపటి నుంచి కొత్త విధానం అమల్లోకి రావడం.. పాత విలువల ప్రకారం ఆఖరు రోజు కావడంతో శనివారం జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద జాతర వాతావరణం కనిపించింది. భూముల పాత విలువల ఆధారంగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల ఖర్చుల భారాన్ని తగ్గించుకోవడం కోసం భూముల క్రయవిక్రదారులు పోటీపడ్డారు. జిల్లా వ్యాప్తంగా రెండు వేలకు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రార్ కార్యాలయాలకు రావడంతో సిబ్బంది రాత్రి వరకూ విధుల్లో మునిగితేలారు.