రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
మంత్రిని కలిసిన రిటైర్డ్ టీజీవోలు
హైదరాబాద్,అక్టోబర్1 (జనం సాక్షి) : తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు శుక్రవారం ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా సంఘం అధ్యక్షుడు మోహన్ నారాయణ, ప్రధాన కార్యదర్శి నర్సరాజు రిటైర్డ్ టీజీవోలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఈసందర్భంగా వారు మంత్రికి ఒక వినతి పత్రాన్ని అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ 35 సంవత్సరాల పాటు సేవలు అందించామని, కానీ ప్రభుత్వం రిటైర్ అయిన తర్వాత పెన్షనర్ల సేవలను విస్మరించడం బాధాకరమని అన్నారు. దేశంలోని ధనిక రాష్టాల్ల్రో ఒకటి అయిన తెలంగాణలో పీఆర్సి`20 సంబంధించి ఉద్యోగ పెన్షన ర్ల వేతన చెల్లింపు సక్రమంగా జరుగక పోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్లను మానసిక వేదనకు గురి చేయకుండా అన్ని రకాల బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.