రిమ్మనగూడ గ్రామంలో దంపతులపై దుండగుల దాడి
గజ్వేల్ : మండలంలోని రిమ్మనగూడ గ్రామంలో దంపతులపై దుండగులు దాడి చేసి చోరికి పాల్పడ్డారు. గ్రామ శివారులో ఉండే గోలాకాశ్రమంలో ఉంటున్న శ్రీనాథ్‌శర్మ, అన్నపుర్ణమ్మ దంపతులపై దాడి చేసి వారి వద్ద ఉన్న రూ. 3.5 లక్షల విలువ చేసే బంగారు నగలు అపహరించుకుపోయారు. బాధితులు పోలిసులకు ఫిర్యాదు చేశారు.