రిమ్స్‌లో ఖాళీలు భర్తీ చేస్తాం

శ్రీకాకుళం, జూలై 21 : రాజీవ్‌ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (రిమ్స్‌)లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు రిమ్స్‌ డైరెక్టర్‌ డివిఎస్‌ రామమూర్తి శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆడియోమెట్రి టెక్నిషియన్‌, రెఫ్రాక్షనిస్ట్‌, డెంటల్‌ హైజినిస్ట్‌, రేడియోగ్రాఫర్‌, డార్క్‌రూమ్‌ అసిస్టెంట్‌ పోస్టులను ఒక ఏడాది కాలానికి కాంట్రాక్టు పద్దతిలో నియమిస్తామని ఆయన పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. తద్వారా తమ సంస్థలో యా విభాగాల్లో సిబ్బంది కొరత కొంత మేర తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.