రిషితేశ్వరి ఆత్మహత్యపై విచారణ సంఘం
ఏపీలోని నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యపై ఆ రాష్ర్ట ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇందుకోసం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం, తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, సింహపురి యూనివర్సిటీల రిజిస్ర్టార్ లు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ విచారణ సంఘం రిషితేశ్వరి ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు, బాధ్యులను గుర్తించనుంది.
ఇలాంటి ఘటనలు మళ్లీ జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇతరలు ఎవరైనా యూనివర్సిటీ హాస్టళ్లలో ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా హెచ్చరించారు.