రుణాల మంజూరుపై అవగాహన సదస్సులు
మెదక్, అక్టోబర్ 9 : జిల్లాలో పరిశ్రమలు స్థాపించుటకు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫెనాన్స్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో రుణాల మంజూరుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు కార్పొరేషన్ అసిస్టెంట్ మేనేజర్ చంద్రప్రకాష్ మంగళవారం నాడు తెలిపారు. ఈ నెల 10న సిద్దిపేటలో, 18న సదాశివపేటలో, 25న జహీరాబాద్‌లో, 29న మెదక్‌లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పారిశ్రామిక వాడల అభివృద్ధికి, కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. వ్యక్తిగత, భాగస్వామ్యం, పబ్లిక్, ప్రైవేట్ కంపెనీలకు, కో-ఆపరేటివ్ సోసైటీల ఆధ్వర్యంలో నెలకొల్పిన పరిశ్రమలకు రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు. పరిశ్రమల స్థాయి పెంచుటకు ఆసక్తి ఉన్న వారికి సదస్సులో సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పరిశ్రమల స్థాయిని బట్టి రుణాల మంజూరికి సహాకారం అందించుటకు పరిశ్రమల అభివృద్ధికై ఈ సదస్సులో కార్పోరేషన్ ఉన్నతాధికారులు పాల్గొంటారని అన్నారు. పారిశ్రామిక వేత్తలు, సంస్థల వారు పరిశ్రమల అభివృద్ధికి అవసరమున్న వారు ఈసదస్సులకు హాజరు కావచ్చని కోరారు. మిగత వివరాలకు ఫోన్ నెం 08455-276719 సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.