రుణ మాఫీ అమలు పట్ల మంథనిలో బిఆర్ఎస్ శ్రేణుల సంబరాలు – కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం – మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
జనంసాక్షి, మంథని : రైతుల రుణ మాఫీని తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్థిక శాఖను ఆదేశించిన నేపథ్యంలో గురువారం మంథనిలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ శ్రేణులు, రైతులు సంబరాలు జరుపుకున్నారు. మంథనిలోని అంబేద్కర్ చౌరస్తాలో మంథని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏగోళపు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో బాణా సంచా కాల్చి అనంతరం కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సంక్షేమమే ధేయంగా ముందుకు సాగుతుందని అన్నారు. కేంద్రం అనుసరించిన విధానాలు, కరోనా ప్రభావం వలన రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు వచ్చాయని, వీటన్నింటిని అధిగమించి రైతులకు తక్షణమే రుణమాపి చేయాలని ప్రకటించడం పట్ల రైతుల మోములో చిరునవ్వులు వెల్లివిరిసాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో ఉపాద్యక్షులు బెల్లంకొండ ప్రకాశ్ రెడ్డి, డైరెక్టర్లు ఆకుల రాజబాపు, లెక్కల కిషన్ రెడ్డి, దాసరి లక్ష్మి-మొండయ్య, దేవళ్ల విజయ్ కుమార్, ఎంపిపి కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలత-శంకర్ లాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కటి అనంత రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు ఆకుల కిరణ్, వైస్ ఎంపిపి కొమ్మిడి స్వరూప్, ఎంపిటిసిలు పెగడ శ్రీనివాస్, ఉదరి లక్ష్మి- లచ్చయ్య, గుమ్మడి సత్యవతి – రాజయ్య, పెండ్లి చైతన్య ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు వడ్లకొండ రవి, శ్రీపతి బానయ్య, నక్క నాగేంద్ర, కాయితీ సమ్మయ్య, వేముల లక్ష్మి, కో ఆప్షన్లు యాకూబ్, గట్టు రాధాకృష్ణ, టిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి అక్కపాక కుమార్, ఎఎంసీ డైరెక్టర్లు వేల్పుల గట్టయ్య, జంజర్ల లింగయ్య, బాబా, గొబ్బూరి వంశీ, ఆలయ చైర్మన్ మాచిడి సత్యనారాయణ, రాజమౌళి గౌడ్, నాయకులు బడికెల శ్రీనివాస్, మంథని లక్ష్మన్, కొండ రవీందర్, శ్రీకాంత్, అశోక్, మందల సత్యనారాయణ, రామడుగు మారుతి, జాగిరి సదానందం, మరియు టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.