రుద్రంగిలో బి.ఎస్.పి ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలు

రుద్రంగి సెప్టెంబర్ 26 (జనం సాక్షి) బహుజన్ సమాజ్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కాదాసు మహేందర్ అద్వర్యంలో చిట్యాల(చాకలి)ఐలమ్మ 127వ జయంతి ఉత్సవాలను బస్ స్టాండ్ ఆవరణలో గల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా మండల అధ్యక్షులు కట్కూరి శంకర్,వేములవాడ నియోజకవర్గ కోశాధికారి దయ్యాల ఉదయ్, మండల ప్రధాన కార్యదర్శి దేశావేణి బూమేష్ హాజరయ్యారు.అనంతరం వారు మాట్లాడుతూ..ఈ భూమి మాది పండించే పంట మాది దొర ఎవడు అని ప్రశ్నించిన వీర వనిత అని భూమి లేకుంటే నోటి కాడ కుడు లేదని భూస్వాములు ప్రజలను పీడిస్తూ వెట్టి చాకిరీ చేపిస్తున్న తరుణంలో ప్రజలను మేలుకొలిపి ప్రజలచే భూస్వాముల మీదికి తిరుగుబాటు చేసి ప్రజలను వెట్టి చాకిరీ నుండి విముక్తి చేసారు.భూస్వాముల నుండి భూములను గుంజుకొని ప్రజలకు పంచడం జరిగిందని అన్నారు.టీ.ఆర్.ఎస్ ప్రభుత్వం ఓట్ల కోసమే ఐలమ్మ పేరుతో రాజకీయం చేస్తుందని అన్నారు.ఐలమ్మ ఆశయాలను బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే సాధించాంగలుగుతమని అన్నారు.ఈ కార్యక్రమంలో సెక్టార్ అధ్యక్షులు సుంచు అనిల్,సెక్టార్ కార్యదర్శులు కాదాసు అనిల్,లింగాల రవి, ఏనుగుందుల సతీష్,సోషల్ మీడియా మండల కన్వీనర్ ఏనుగుందుల రాకేశ్, నాయకులు దేశవేణి గంగాధర్,కాదాసు శ్రీనివాస్,అక్కేనపెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.