రూ. 10 లక్షల టేకు కలప స్వాధీనం

కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లా గోదావరిఖని తిలక్‌నగర్‌లో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా ఈ టేకు కలపను లారీలో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. టేకు కలప సుమారు రూ. 10 లక్షలు ఉంటుందని అంచనా.