రూ. 100 క్యాష్‌బ్యాక్ ఆఫర్

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వినియోగదారులతో పాటు వ్యాపార సంస్థలకు కూడా డిజిటల్ చెల్లింపుల ద్వారా ట్రాన్సాక్షన్స్ పాల్పడితే క్యాష్‌బ్యాక్ ఇవ్వాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో నగదు చెల్లింపులు కూడ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని కేంద్రం భావించింది.  అయితే.. అనుకున్నంతగా డిజిటల్ చెల్లింపులు నమోదు కావడం లేదు. ఇంకా కూడ ఎక్కువగానే నగదు చెల్లింపులపైనే ఆధారపడుతున్న పరిస్థితి కన్పిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని డిజిటల్ చెల్లింపులను ప్రోత్సాహించాలని కేంద్రం కొత్త ప్లాన్ చేస్తోంది. నగదు రహిత చెల్లింపులు చేసే వినియోగదారులకు గరిష్ట చిల్లర ధరలో తగ్గింపు ఇస్తారు. ఈ మొత్తాన్ని రూ.100లకు పరిమితం చేస్తారు.వ్యాపార సంస్థలకు వాటి టర్నోవర్‌ ఆధారంగా క్యాష్‌బ్యాక్‌ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. వచ్చే నెల 4న ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ ముందు ఈ ప్రతిపాదన పెట్టనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే PMOలో చర్చ జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇలాంటి ప్రోత్సాహకాలను అమలు చేస్తే నగదు వినియోగం కూడ మరింత తగ్గే అవకాశం ఉంది. ప్రతి చిన్న దానికి కూడ నగదు చెల్లింపులపైనే ఆధారపడాల్సిన అవసరం ఉండదు.