రూ.25కే ఉల్లిని అందిస్తున్నాం

– ఎక్కడ ఉల్లి దొరికితే అక్కడ కొనుగోళ్లు చేస్తున్నాం

– హెరిటేజ్‌లో రూ. 200కు విక్రయిస్తున్నారు

– మళ్లీ అసెంబ్లీలో చంద్రబాబు ఉల్లిపై చర్చఅంటాడు

– విూరు చేసే పనులకు న్యాయం, ధర్మం ఉందా?

– అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి

అమరావతి,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): ఉల్లి కొరత దేశవ్యాప్తంగా ఉందని, ఏపీలోనూ ఉల్లికొరతతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం రైతు బజార్‌లలో కిలో ఉల్లి రూ. 25కే సబ్సిడీపై అందిస్తుందని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీలో ఉల్లిపాయల కొరతపై చర్చించాలని కోరుతూ టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే స్పీకర్‌ తమ్మినేని సీతారం ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. ఈ క్రమంలో చర్చించాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యేలు పోడియాన్ని చుట్టుముట్టారు. స్పీకర్‌కు ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఉల్లిపాయల గిప్ట్‌ ప్యాక్‌ ఇచ్చారు. పౌరసరఫరాల మంత్రి నియోజకవర్గంలోనే క్యూలో నిలబడి సాంబయ్య మృతిచెందిన విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు సభలో గుర్తుచేశారు. ఈ గందరగోళం మధ్యనే మహిళలకు భద్రతకు సంబంధించిన బిల్లును ¬ంమంత్రి సుచరిత శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ¬ంమంత్రి ప్రసంగానికి టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. దీంతో స్పందించిన జగన్మోహన్‌రెరెడ్డి ¬ం మంత్రి మాట్లాడుతుంటే అడ్డుకుంటారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యాచార ఘటనల్ని నిరోధించేందుకు ఇలాంటి చట్టం అవసరమని సీఎం చెప్పుకొచ్చారు. ముఖ్యమైన అంశంపై చర్చ జరిగేటప్పుడు టీడీపీ ఎమ్మెల్యేల ప్రవర్తన బాగాలేదని జగన్‌ మండిపడ్డారు. ప్రతిపక్షం ఉల్లిపాయల విూద ఏదైతే స్జబెక్ట్‌ తీసుకొని వస్తున్నారో ఆ ఉల్లిపాయలపై చర్చ జరపటానికి సిద్ధంగానే ఉన్నామని జగన్‌ అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చెయ్యని కార్యక్రమాలు మా ప్రభుత్వం చేస్తోందని జగన్‌ అన్నారు. ఉల్లి గురించే మాట్లాడుతున్నానని దేశం మొత్తం విూద ఏపీలో మాత్రమే కేజీ 25 రూపాయలకు ప్రజలకు అందుతోందని జగన్‌ అన్నారు. ఇంత తక్కువ రేటుకు ఉల్లిని అమ్ముతున్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమే అని సీఎం జగన్‌ అన్నారు. ప్రతి రైతు బజార్‌ లోను రూ.25కే కేజీ ఉల్లిని అమ్ముతున్నామని జగన్‌ చెప్పారు. ఇప్పటివరకు 36,536 క్వింటాళ్లు కొనుగోలు చేసి రైతు బజార్లలో కేజీ 25 రూపాయలకు అమ్ముతున్నామని జగన్‌ అన్నారు. సోలాపూర్‌, అల్వాల్‌ నుండి కూడా ఉల్లిని కొనుగోలు చేసున్నామని సీఎం జగన్‌ చెప్పారు. ఎక్కడ ఉల్లి దొరికితే అక్కడ ఉల్లిని కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఉల్లి పంట రైతులకు గిట్టుబాటు కాక పొలాల్లోనే వదిలేసిన పరిస్థితిని చూశామని చెప్పారు. ఈరోజు రైతులకు గిట్టుబాటుధర లభిస్తోందని, వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జగన్‌ చెప్పారు. చంద్రబాబు హెరిటేజ్‌ షాపులో కేజీ ఉల్లి 200 రూపాయలకు అమ్ముతున్నారని జగన్‌ అన్నారు. 200 రూపాయలకు అమ్ముతున్న విూరా మాట్లాడేది అని జగన్‌ ప్రశ్నించారు. విూరుచేసే పనులకు న్యాయం, ధర్మం ఉందా అని జగన్‌ అన్నారు. మహిళల భద్రత గురించి చర్చజరగాల్సిన అవసరం ఉందని జగన్‌ అన్నారు. మహిళల భద్రత గురించి లోతైన చర్చ జరగాలని చట్టంకూడా తీసుకొనిరాబోతున్నామని సీఎం జగన్‌ చెప్పారు.