రూ.30 లక్షల అక్రమ కలప పట్టివేత

కరీంనగర్‌ : గోదావరిఖని సమీపంలో లారీలో అక్రమంగా తరలిస్తున్న కలపను సింగరేణి భద్రతాసిబ్బంది ఈ ఉదయం పట్టుకున్నారు. కలప విలువ సుమారు రూ. 30 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. ఘటన గురించి పోలీసులకు సమాచారమందించి వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు.