రూ.4లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్ల పట్టివేత

ఆదిలాబాద్‌: ప్రైవేటు బస్సులో పెద్దమొత్తంలో తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 4లక్షల వరకూ ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.