రూ. 44వేల విలువైన గుట్కాప్యాకెట్లు స్వాధీనం

మెట్‌పల్లి, జనంసాక్షి: న్యూస్‌లైన్‌ పట్టణంలోని పలు హూల్‌సెల్‌ కిరాణాదుకాణాలపై సీఐ దేవేందర్‌రెడ్డి సిబ్బందితో సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. పలువురు వ్యాపారులు గుట్టుగా గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నారనే సమాచారం సమాచారం మేరకు దాడులు చేపట్టారు.
ఈదాడుల్లో భవాని, మహలక్ష్మి, జ్యోతి ట్రేడర్స్‌ రూ. 44వేల విలువైన గూట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. సంబంధిత దుకాణాల యాజమానులు నరాల దామోదర్‌, గంగుల మహేశ్‌, అయితే శ్రీనివాస్‌పై సీఐ కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. వ్యాపారులెవరైనా గూట్కా ప్యాకెట్లు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.