రూ. 5.60కోట్ల చెరకు బకాయిల విడుదల
మల్లాపూర్: మండలంలోని ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీకి జనవరి 30 వరకు చెరకును తరలించిన రైతులకు రూ. 5.60కోట్ల బిల్లులను సంబంధిత బ్యాంకుల్లో జమ చేసినట్లు ఎన్‌డీఎన్‌ఎల్ మేనేజర్ జయరాందాన్ శనివారం తెలిపారు. మరో రెండు రౌండ్ల బిల్లులను త్వరలో విడుదల చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.