రూ.60వేలతో చేతిపంపు నిర్మాణ పనుల ప్రారంభం
కాగజ్‌నగర్: పట్టణంలోని సీతాపతి ఏరియాలో మంచినీటి ఎద్దటి నివారణకు తెరాస మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షుడు జబ్బార్‌ఖాన్ చేయూత నిచ్చారు. కాలనీలో తమ సొంత డబ్బులు రూ.60వేలతో చేతిపంపు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో తెరాస నాయకులు పాల్గొన్నారు.