రెండవ విడత సహకార ఎన్నికల్లో అత్యధుకుల పోటీ

ఆదిలాబాద్‌, జనవరి 29 (): జిల్లాలోని సహకార సంఘాల ఎన్నికల్లో భాగంగా రెండవ విడతగా జరగనున్న 39 సహకార సంఘాల ఎన్నికల్లో 1735 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. ఫిబ్రవరి 4న రెండవ విడతగా జరగనున్న  ఈ ఎన్నికలకు భారీగా  నామినేషన్లు దాఖలైయ్యాయి. తొలి విడతలో 489 ప్రదేశిక నియోజకవర్గాలకు నామినేషన్లు, ఉపసంహరణ పూర్తి కాగా, ఈ నెల 31న  ఎన్నికలు జరగనున్నాయి. రెండవ విడతలో జరిగే 507 ప్రదేశిక నియోజకవర్గాలకు కాను మూడు సంఘాలు,75 ప్రదేశిక నియోజకవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఆదిలాబాద్‌ డివిజన్‌లో ఉన్న 17 సంఘాల్లోని 215 ప్రదేశిక నియోజకవర్గలకు 531 మంది నామినేషన్లు వేశారు. నిర్మల్‌ డివిజన్‌లోని ఎనిమిది సంఘాల్లో గల 104 ప్రదేశిక నియోజకవర్గాలకు 480 మంది నామినేషన్లు దాఖలు చేయగా, మంచిర్యాల డివిజన్‌లోని 14 సహకార సంఘాల్లోని 182 ప్రదేశిక నియోజకవర్గాలకు 724 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఎన్నికలు ఫిబ్రవరి 4న జరగనున్నాయి.  మలి విడత ఎన్నికలపై  అన్ని రాజకీయ పార్టీలు తమ దృష్టిని సారించాయి.