రెండు కార్లు ఢీ:ముగ్గురి మృతి

మెదక్: రెడ్డిపల్లి వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. హైదరాబాద్ లోని మియాపూర్ జేపీ నగర్ కు చెందిన వంగ పుష్పవతి, యశశ్విన్95), రత్న రెడ్డి(60) కారులో బాసర ఆలయానికి బయలు దేరారు. చేగుంట సమీపంలోకి రాగానే మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రామాయం పేట సీఐ నందీశ్వర్ రెడ్డి, చేగుంట ఎస్సై శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.