రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. వ్యక్తి మృతి

వేములవాడ: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం మర్రిపల్లి గ్రామ శివారులో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసముంటున్న ఎల్కపల్లి మల్లేష్(46) నాలుగు రోజుల క్రితమే సౌదీ నుంచి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో ఉదయం బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్తుండగా.. గ్రామ శివారులోకి వెళ్లగానే ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వాహనంపై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.