రెండు బైక్‌లు ఢీ- ఇద్దరు వ్యక్తులు మృతి

కోహెడ: మండలంలోని సిద్దిపేట-హుస్నాబాద్‌ ప్రధాన రహదారి సముద్రాల, ఇందిరానగర్‌ స్పీడ్‌బ్రూకర్‌ వద్ద మోపెడ్‌, మోటర్‌సైకిల్‌ను ఢీకొనడంతో ఎక్కల వేణు( 25), తాడిపత్రి శ్రావణ్‌ (34)లుతీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింస్తుండగా మార్గ మధ్యంలో చని పోయారు. వేణు కోహెడ మండలం మైసంవల్లికి, శ్రావణ్‌ వరంగల్‌ లోని మాములూరుకు చెందినవారు. శ్రావణ్‌ ట్రాన్స్‌కోలో లైన్‌ మేన్‌గా పని చేస్తున్నారు.వేణు ఐవీఆర్పీఎల్‌ కంపెనీలో పనిచేస్తున్నారు.బైక్‌ మీద ఉన్న ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు.