రెండు ముక్కలు చేయాలి: జంగాడ్డి
సమావేశంలో మాజీ ఎంపీ జంగాడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలా పార్టీని కూడా రెండు ముక్కలు చేయాలని తెలంగాణ కమిటీపై తన మనసులో మాట బయటపెట్టారు. తొలుత పార్టీ జిల్లా ఇన్‌చార్జి సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీలో ఎలాంటి విభేదాల్లేవని, మోడీ ప్రధాని అవుతాడని, అధికారంలోకి వచ్చిన వంద రోజులకు తెలంగాణ వస్తుందని జోస్యం చెప్పగా, పార్టీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు అందరం కలసే ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. ”ఏ జిల్లాలోలేని సభ్యత్వం ఇక్కడ ఉంది. అన్ని కార్యక్షిక్షమాలూ విజయవంతం చేస్తున్నాం.. దయచేసి గ్రూపులున్నట్లు రాయకండి.” అని కోరారు. ‘మాది వారసత్వ రాజకీయల పార్టీకాదు, మాలో గ్రూపుల్లేవు” అని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణాడ్డి అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బల్మూరి వనిత మాట్లాడుతూ మురళీధర్‌రావు తెలంగాణ జిల్లాలో ్ల పార్టీకి పూర్వవైభవం తెస్తారని అశాభావం వ్యక్తం చేయగా, జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త శ్రీనివాస్ రెడ్డి మురళీధర్‌రావు గురించి పరిచయం చేశారు. మాజీ ఎమ్మెల్యే కాశిపేట లింగయ్య పాటలు పాడి కార్యకర్తలను ఉత్తేజ పరిచారు. వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు ప్రసంగించారు.