రెవిన్యూ సదస్సును అడ్డుకున్న జెన్‌కో నిర్వాసితులు
మల్హర్: మండలంలోని తాడిచర్ల ఉపరితల గని బొగ్గు తవ్వకాల్లో కోల్పోయిన అసైన్ట్ భూములకు పరిహారం చెల్లించడ ంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా నిర్వాసితులు రెవిన్యూ సదస్సు అడ్డుకున్నారు. ప్రభుత్వ భూములను ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నామని పరిహారం చెల్లించే విషయంలో అటవీశాఖ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు.