రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలి

బజార్‌హత్నూర్‌: మండల రైతులు తమ సమస్యలను రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని తహశీల్దారు లక్ష్మయ్య పేర్కొన్నారు. మండలంలోని ధర్మపురి పంచాయతీ పరిధిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తహశీల్దారు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సు ద్వారా రైతులు విరాసత్‌కు సంబంధించి 7 దరఖాస్థులు, కౌలుకు సంబంధించి 3. భూపంపకాలకు సంబంధించి 1 దరఖాస్థు అందజేశారని రెవెన్యూ అధికారులు తెలిపారు. అందులో అటవీహక్కు చట్టం లబ్ధిదారుల సమస్యలకు సంబంధించి 3 దరఖాస్తులు సమర్పించారని పేర్కొన్నారు. భూ సమస్యలకు సంబంధించి దరఖాస్థులను స్వీకరించి మీ సేవ ద్వారా సకాలంలో పరిష్కరిస్తామని తహశీల్దారు హామీ ఇచ్చారు.