రెవెన్యూ సదస్సుల్లో 72,708 దరఖాస్తులు

కరీంనగర్‌, (జనంసాక్షి): గత నెల 12 నుంచి ఈనెల 10 వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 72,708 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 15 వేల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించామని డీఆర్‌ఓ కృష్ణారెడ్డి తెలిపారు. మిగతా దరఖాస్తులను కేటగిరిల వారిగా 90 రోజుల్లో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. భూ సంబంధమైన పాత దరఖాస్తులు లేకుండా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.

కమలాపూర్‌: మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన న్యాయవాది బండి కళాధర్‌ దళితరత్న అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదకొండేళ్లుగా తన సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేయడం అభినందనీయమన్నారు. హైదరాబాద్‌ రవీంవూదభారతిలో ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. అవార్డుకు ఎంపిక చేసిన మాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారెంశివాజీ, జిల్లా అధ్యక్షులకు కృతజ్ఞతలు చెప్పారు.