రేణుకాచౌదరి దిష్టిబొమ్మ దహనం

జూలపల్లి: కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు రేణుకాచౌదరి వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం జూలపల్లిలో తెరాస నాయకులు ఆమె దిష్టి బొమ్మను దహనం చేసి, నినాదాలు చేశారు. తెలంగాణా కోసం ప్రాణాలు కోల్పోయిన అమరుల త్యాగాలను అవహేళన చేస్తున్నారంటూ వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాఠకుల అనీల్‌, నాడెం మల్లయ్య, రాజలింగం, కుమార్‌, మల్లేశం, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.