రేణుకా చౌదరిని విమర్శించిన టీఆర్‌ఎస్‌ నేత వివేక్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి పచ్చి తెలంగాణ ద్రోహి అని టీఆర్‌ఎస్‌ నేత, ఎంపీ వివేక్‌ విమర్శించారు. ఆమె పదవుల కోసం పాకులాడే వ్యక్తి అని దుయ్యబట్టారు. శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదవ చాప్టర్‌క్ష్మీ అమల్లో భాగంగానే తెలంగాణవాదులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వివేక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణహిత ప్రాజెక్టు పూర్తయితే ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లోని 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. కానీ, సీఎం కిరణ్‌ ప్రాణహితకు విధులు కేటాయించకుండా తన సొంత జిల్లా చిత్తూరుకు వేల నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు.