రేపాలలో ఘనంగా కోదాటి లక్ష్మీ నరసింహారావు 20వ వర్ధంతి వేడుకలు

మునగాల,జులై22(జనంసాక్షి)
తెలంగాణ నాటక తొలి రచయిత కేఎల్ నరసింహ రావు 20వ వర్ధంతి కార్యక్రమాన్ని గ్రామ వెలుగు నాట్యమండలి ఆధ్వర్యంలో మండల పరిధిలోని రేపాల గ్రామంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రేపాల గ్రామ వెలుగు నాట్య మండలి వ్యవస్థాపక అధ్యక్షులుగా, తొలి తెలంగాణ మాండలిక కవిగా దూరదర్శన్లో ఉద్యోగం చేస్తూ, ఎన్నో రచయితలు రాసి ప్రజల మన్ననలు పొందిన కే ఎల్ ఎన్ రావు ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని నాట్యమండలి అధ్యక్షులు పానుగోటి రంగా అన్నారు. గ్రామ వెలుగు నాట్యమండలికి ఆయన చేసిన  సేవలు నేటికీ మరువలేనివని కళాకారులకు ఆయన లేని లోటు తీరనిదని  కేఎల్ యెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి పందిరి పుల్లారెడ్డి అన్నారు.  గ్రామ గ్రంథాలయ ఆవరణలో ఉన్న కే ఎల్ ఎన్ రావు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ కార్యక్రమంలో  సీనియర్ కళాకారులు, మాచర్ల రామయ్య, సారిక లింగయ్య, పరుశరాములు, గండు నారాయణ, దేవదాసు, గవిని చిన్న లక్ష్మీనరసింహ,గండు నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Attachments area