రేపు అష్టోత్తరశత 108 దుర్గాదేవిల నిజ దర్శనం.

: పోస్టర్లను విడుదల చేస్తున్న వన్ టౌన్ సీఐ.
బెల్లంపల్లి, అక్టోబర్2,(జనంసాక్షి)
బతుకమ్మ పండుగ, దుర్గాదేవి నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మకుమారిస్ బెల్లంపల్లి శాఖ వారి ఆధ్వర్యంలో తేదీ 4 /10 /2002 మంగళవారం రోజున సాయంత్రం ఐదున్నర గంటల నుండి స్థానిక ఎఎంసి గ్రౌండ్లో 108 మంది మహిళ, యువతి మణుల చేత ఒకే వేదికపై దుర్గాదేవిల అలంకరణతో అష్టోత్తర శత 108 చైతన్య దుర్గాదేవి ల నిజ దర్శనం కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా నిర్వహిస్తున్న వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు అవుతున్న కారణంగా బెల్లంపల్లి పట్టణ మండల ప్రజలు కుటుంబ సభ్యులతో సహా పెద్ద సంఖ్యలో హాజరై అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షించి విజయవంతం చేయవలసిందిగా నిర్వాహకులు బికే పద్మ కైవల్య తెలియజేశారు. ఈకార్యక్రమం ప్రచారంలో భాగంగా ఆదివారం బెల్లంపల్లి పట్టణ వన్ టౌన్ సీఐ ముస్కే రాజు గారి చేతుల మీదుగా గోడ ప్రతులను విడుదల చేశారు.
ఈ కార్యక్రమం నిర్వాహకులతో పాటుగా ప్రతినిధులు మడుపు రవికుమార్, చిదిరాల ఉమా ప్రసాద్, జె భూమేష్, బండి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.