రేపు ఇందిరాపార్కు వద్ద తెలంగాణ జేఏసీ ధర్నా

హైదరాబాద్‌: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఒకే నఅభిప్రాయం  చెప్పేలా ఒత్తిడి తేవాలని తెలంగాణ జేఏసీ సంకల్పించింది. ఈ మేరకు రేపు ఇందిరాపార్కు వద్ద పెద్ద ఎత్తున్న ధర్నా చేయాలని నిర్ణయించింది. ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌ శ్రేణులు, తెలంగాణ వాదులు హాజరుకావాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది.

భారీగా తరలిరండి :  టీ పద్మారావు

రేపు తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నాకు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌ శ్రేణులు, కార్యకర్తలు హాజరుకావాలని టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు టీ పద్మారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణకు అనుకూలంగా పార్టీలు తమ నిర్ణయం తెచ్చేలా ఒత్తిడి తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.