రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు

హైదరాబాద్‌, జనంసాక్షి: పార్లమెంట్‌లో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయేందుకు గాను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయనతో పాటు ఎంపీలు, మాజీ ఎంపీలు సైతం పాల్గొంటారు. చంద్రబాబును స్పీకర్‌ మీరాకుమార్‌ ఆహ్వానించడం శుభపరిణామమని తెదేపా పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు అన్నారు.