రేపు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సీఎం పర్యటన
హైదరాబాద్, జనంసాక్షి: అమ్మహస్తం కార్యక్రయంలో భాగంగా ముఖ్యమంత్రి మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అమ్మహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడ ఏర్పాటు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం విజయనగరం జిల్లా గజపతినగరం చేరుకుని అమ్మహస్తం పథకం ప్రారంభోత్సవంతోపాటు లబ్ధిదారులకు ఉపకరణాల పంపిణీ, కొత్తగా ఏర్పాటు చేసిన 108 వాహనాలను ప్రారంభిస్తారు. రాత్రికి సీఎం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.