రేషన్ అందలేదన్న ఫిర్యాదు రావద్దు
డీలర్లకు సిఎం చంద్రబాబు హెచ్చరిక
అమరావతి,జూన్18(జనం సాక్షి): పనితీరు సరిగ్గా లేని రేషన్ డీలర్స్‌తో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ లీడర్స్‌కి హెచ్చరికలు, పలు సూచనలు చేశారు. పౌరసరఫరాలలో 90 శాతానికి పైగా ప్రజాసంతృప్తి సాధించాలన్నారు. 70 శాతానికి తక్కువ సంతృప్తి సాధించిన డీలర్స్‌పై విచారణ చేస్తామని హెచ్చరించారు. ఒక్కరూ కూడా తమకు రేషన్ అందలేదని ఫిర్యాదు చేసే పరిస్థితి రావొద్దని, అవసరమైతే వినియోగదారుల ఇంటికి వెళ్లి రేషన్ అందివ్వాలని సీఎం ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం నుంచి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో రేషన్ పంపిణీపై సవిూక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎవరూ రేషన్ అందలేదన్న ఫిర్యాదు చేయకుండా సరఫరా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. అవసరమైతే లబ్దిదారుని ఇంటికి రేషన్ అందజేయాలని చంద్రబాబు అన్నారు.