రైతాంగానికి అండగా నిలిచిన ఘనత కెసిఆర్‌ది: ఇర్రి
జనగామ,ఆగస్ట్28(జనం సాక్షి ): వ్యవసాయానికి పెట్టుబడి, రూ.5 లక్షల బీమా ఇస్తున్న ఘనత తమదే అని రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డిఅన్నారు. కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చేందుకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారని, 36 రకాల పథకాలను అమలు చేస్తున్నారని చె ప్పారు. రాష్ట్రంలో 70 లక్షల గొర్రెలను పంపిణీ చేస్తే 35 లక్షల పిల్లలతో కోటికి పైగా సంపద వృద్ధి అయ్యిందని, కాంగ్రెస్ నాయకులు మతిలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్నంపెట్టే పాడి సంపద, గొర్రెలను అమ్ముకోవడం సరికాదని మంత్రి సూచించా రు. టీఆర్‌ఎస్ జెండాప్రజల ఎజెండా అని ఎప్పుడు ఎన్నికలువచ్చినా ప్రజలు టీఆర్‌ఎస్ వెంటే ఉంటారని అన్నారు. ప్రగతినివేదన సభ ఓ చారిత్రక మైలురాయి కానుందన్నారు.రాజకీయాల్లో చరిత్రలో నిలిచిపోయే నాయకులు అరుదుగా ఉంటారని, ఆ కోవలో కెసిఆర్ ఉన్నారని అన్నారు. కెసిఆర్ ముందుచూపుతో ఊరూరా గోదావరి జలాలతో చెరువులు నిండడంతో యాసంగిలో ధాన్యం దిగుబడి రికార్డు స్థాయిలో వచ్చిందన్నారు. గతంలో మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య జనగామ ప్రజలు, రైతుల కష్టసుఖాలు ఏనాడూ చూడలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో గెలుస్తామని కలలు కంటున్నారని వారు జీవితంలో గెలవరని అన్నారు.తెలంగాణలో 90 శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాల ఆర్థిక, విద్యాభివృద్ధికి రూపొందిస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పేదలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం కల్యాణలక్ష్మి,కేసీఆర్ కిట్, ప్రసూతి సాయం అందజేస్తున్నట్లు వివరించారు. అన్నివర్గాల ప్రజల బాగోగులు చూసే గొప్ప ప్రభుత్వం మరొకటి లేదని, ఇంతటి ఆలోచన చేస్తున్న కేసీఆర్‌కు అందరి ఆశీస్సులు ఉండాలని కోరారు.