రైతుఉల నష్టపోకుండా కొనుగోళ్లు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): వర్షాలతో రంగు మారిన, తడిసిన పత్తి,సోయాబీన్‌ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ధర నిర్ణయించి కొనుగోలు చేస్తుందని మార్కెటింగ్‌ అధికారులు అన్నారు. ఈ కమిటీలో కొనుగోలు దారుడు, మార్కెటింగ్‌ అధికారి, వ్యవసాయ అధికారి, ఆయిల్‌ఫెడ్‌ అధికారులు సభ్యులుగా ఉంటారన్నారు. రైతులందరికీ మద్దతు ఇప్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర తగ్గకుండా సోయాబీన్‌ కొనుగోలు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ కృష్ణారెడ్డి కూడా మార్కెటింగ్‌శాఖ అధికారులకు సూచించారు. సోయాబీన్‌కు ప్రకటించిన మద్దతు ధర కంటె ఎక్కువ చెల్లించే వీలుంటే వేలం నిర్వహించాలని సూచించారు. వ్యాపారులు, కవిూషన్‌ ఏజెంట్లకు అనుమతి లేదన్నారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.