రైతుబంధు పథకం దేశానికి ఆదర్శం
కాపీ కొట్టడంలోనూ విఫలం అయిన కేంద్రం: ఎమ్మెల్సీ
జనగామ,ఫిబ్రవరి2(జనంసాక్షి): గత ప్రభుత్వాల పాలనలో రైతును పట్టించుకన్నా నాథుడే కరువయ్యారని
ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. రైతుపెట్టబడి పథకం దేశానికే ఆదర్శం కాబోతున్నదని అన్నారు. ఈ పథకాన్ని కాపీకొట్టినా కేంద్రం పూర్తిగా అమలు చేసేలా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని అన్నారు. రైతుబంధును మించి పథకం లేదని తాజా బడ్జెట్ ద్వారా మరోమారు నిరూపితం అయ్యిందన్నారు. ఎకరానికి నాలుగువేలు చొప్పున, రెండువిడుతలుగా రైతులకు అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించి అమలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రభుత్వం ఎంత చిత్తశుద్దిగా పనిచేసిందో రుజువు చేసిందని అన్నారు. రైతుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఖరీఫ్ సీజన్ నుంచి ప్రతి ఎకరానికి రూ.8వేలు రైతులకు అందజేస్తూ పెట్టబడి కింద సాయం అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే దక్కిందన్నారు. ఇకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు మద్దతు ధర అందుతోందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరలు అందజేస్తున్నట్లు చెప్పారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతీ గ్రామానికి గోదావరి జలాలను అందించడంతో వరిసాగు పెరిగిందని చెప్పారు. కుల వృత్తులను పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కుల సంఘాలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. కల్యాణలక్ష్మీ పథకం కింద రూ.75 వేల నుంచి రూ.లక్షా116లకు పెంచి సీఎం కేసీఆర్ పేదల కుటుంబాలకు పెద్దన్న పాత్ర పోషఙస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ పథకం క్రమం క్రమంగా విడుతల వారిగా నిరుపేద కుటుంబాలకు ప్రతి ఒక్కరికీ అందిచేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు.