రైతుబంధు పథకానికి వానకాలం లో 6 లక్షల ఎకరాల గుర్తింపు
యాదాద్రి భువనగిరి బ్యూరో.జనం సాక్షి
యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతు బంధు పథకం కింద ప్రస్తుత వానకాలం సీజన్ కు 6 లక్షల ఎకరాలను గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.జిల్లాలో వానకాలం 2022 లో మొత్తం 254977 మంది రైతులు అర్హులు గుర్తించామని దీనిలో 221593 మంది పాత రైతులు ఉండగా కొత్తగా 33384 మంది రైతులు నమోదు అయ్యారని మొత్తం ఆరు లక్షల ఎకరాలకు గాను 303,87,29,225/- చెల్లించాల్సి ఉందన్నారు. ఇందుమూలంగా రైతులు వారి బ్యాంక్ అకౌంట్ నెంబరు మార్చుకోదగిన వారు, వారి బ్యాంక్ అకౌంట్ పాసు పుస్తకము కాపీని జిరాక్స్ చేసి మరియు క్రొత్తగా పట్టాదారు పాసుబుక్ పొందిన రైతులు వారి పట్టాదారు పాసు పుస్తకము మొదటి పేజీని మరియు బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్ కాపీని సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి గారికి ఇవ్వగలరు . 22.6.2022 నాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులందరూ అర్హులని జిల్లా కలెక్టర్ సూచించారు.