రైతులకు అవగాహన సదస్సు

జిల్లా రైతుబంధు అధ్యక్షులు రమణారెడ్డి
బచ్చన్నపేట సెప్టెంబర్ 29. జనం సాక్షి. బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట గ్రామంలోని రైతు వేదికలో రైతులకు డివిజన్ స్థాయిలో అవగాహన సదస్సు నిర్వహించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనగామ జిల్లా రైతుబంధు అధ్యక్షులు ఇరి రమణారెడ్డి. జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ. వ్యవసాయ శాఖ అమలుపరుస్తున్న నాలుగు ఇంటర్వెన్షన్స్ అయినటువంటి పచ్చి రొట్టె ఎరువులు సాగు. వెదజల్లే పద్ధతిలో వరి సాగు. పి ఎస్ పి వాడకం దఫా దఫాలుగా ఎరువుల వాడకం వంటి కార్యక్రమాలతో పాటు పిఎస్పీ వాడటం వల్ల నేలలో నిక్షిప్తమైన ఉన్నటువంటి భాస్వరాన్ని మొక్కలకు అందించే విధంగా ఈ బ్యాక్టీరియా దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల కోఆర్డినేటర్ కల్లూరి సంజీవరెడ్డి. అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్. ఎస్ఎస్ బీనా. మండల పరిషత్ వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి. మండల వ్యవసాయ అధికారి విద్యాకర్ రెడ్డి. గ్రామ సర్పంచ్ గట్టు మంజుల. ఎంపీటీసీ మామిడి అరుణ. చిన్న రామచెర్ల. తమ్మడపల్లి. పోచన్నపేట. గ్రామాల రైతుబంధు సమితి కోఆర్డినేటర్లు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు . జనగామ డివిజన్ విస్తీర్ణ అధికారులు రైతులు ఉన్నారు