రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటాం
– రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
సూర్యాపేట ( జనంసాక్షి ): రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఎల్లవేళలా అండగా ఉంటామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని కార్మికులకు ఏకరూపు దుస్తుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులకు ఎలాంటి నష్టం తమ ప్రభుత్వం రానివ్వదని, రైతులకు వెన్నంటి తమ ప్రభుత్వం ఉంటుందన్నారు.కేంద్ర ప్రభుత్వం బావులకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేసిన సీఎం కేసీఆర్ ససేమీరా ప్రాణం ఉన్నంతవరకు ఆ పని చేయనని అన్నారని గుర్తు చేశారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రాశారని, దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుందన్నారు.ప్రజలను ఐక్యంగా లేకుండా చూడటానికి కొన్ని దుష్టశక్తులు పన్నాగాలు పన్నాయని, ప్రజలు దానిని గమనించి మసులుకోవాలని కోరారు. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు.దేశంలో ఎక్కడ ఉచిత కరెంటు ప్రస్తావన లేదని, ఎన్ని కష్టాలు ఎదురైనా మన రాష్ట్రంలో ఉచిత కరెంట్ అమలుపరుస్తున్న సీఎం కేసీఆరే అన్నారు.అనంతరం కార్మికులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు.అంతకుముందు సీడ్స్ కార్పొరేషన్ గోదామ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలిత ఆనంద్ , సెక్రటరీ ఫస్యుద్దీన్ ,తెలంగాణ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫాస్ట్రక్చర్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, వార్డ్ కౌన్సిలర్స్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
2 Attachments • Scanned by Gmail