రైతులకు కాంగ్రెస్‌ చేసిందేం లేదు

– కేవలం హావిూలతోనే మోసగిస్తూ వచ్చింది
– బీజేపీ హయాంలో రైతులకు పెద్దపీట వేస్తున్నాం
– 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే బీజేపీ లక్ష్యం
– ప్రధాని నరేంద్ర మోదీ
ముక్తసర్‌, జులై11(జ‌నం సాక్షి) : 70 ఏళ్లుగా రైతుల కోసం కాంగ్రెస్‌ పార్టీ చేసిందేవిూ లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్‌ కేవలం హావిూలతో రైతులను మోసగిస్తూ వచ్చిందన్నారు. రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర పెంచుతామని హావిూ ఇచ్చి నెరవేర్చిన ఘనత తమకే దక్కుతుందని  ప్రధాని మోడీ పేర్కొన్నారు. పంజాబ్‌ రాష్ట్రం ముక్తసర్‌ జిల్లాలోన ఇమాలోత్‌లో నిర్వహించిన కిసాన్‌ కల్యాణ్‌ ర్యాలీలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఇన్నాళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ కేవలం ఒక కుటుంబం క్షేమం కోసమే పని చేసిందన్నారు. దేశంలోని రైతులందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని.. రైతులందరూ సుఖంగా నిద్ర పోతున్నారని ప్రధాని తెలిపారు. కానీ కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలకు మాత్రం నిద్ర రావడం లేదని మోదీ చెప్పారు. గతంలో అమలు కానీ వాగ్దానాలు ఇచ్చి రైతులను కాంగ్రెస్‌ మోసం చేసిందని ధ్వజమెత్తారు. దేశంలోని రైతులందరినీ ఓట్ల కోసం కాంగ్రెస్‌ వాడుకుందని మోదీ మండిపడ్డారు. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం.. రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని ఉద్ఘాటించారు. ఈ మూడేళ్లలో వ్యవసాయ ఉత్పత్తులను రైతులు రెట్టింపు చేశారని తెలిపారు. వరికి కనీస మద్దతు ధరను భారీగా పెంచామని మోదీ గుర్తు చేశారు. వరితో పాటు మరో 13 ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధరను పెంచడానికి నిర్ణయం తీసుకోవడంతో రైతులకు సమస్యలు ఉండవని మోదీ తెలిపారు. ఈకార్యక్రమంలో పంజాబ్‌ సీఎం